కన్నకలలు సాకారమైన వేళ .......
ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ వస్తున్న బ్లాగ్ తయారు చేసిన రోజు ఇది...!!!(పంతొమ్మిది సెప్టెంబర్).
తరవాణి అంటే ఏంటి??
చాలామందికి వచ్చే అతి సాధారణ సందేహం ఇది ...
తరవాణి అనేది అన్నం మరియు గంజి తో చేసే పదార్థం.
పులియ బెట్టిన గంజి లో వేడి వేడి అన్నం వేసి .... దాన్ని ౩ రోజుల తర్వాత తినడానికి ఉపయోగిస్తారు..
నాగరిక సమాజం లో బ్రతుకుతున్న ఏంటో మందికి వెగటు గా అనిపించినా... మనిషి శరీరానికి ఎంతో మంచిది ఈ "తరవాణి"..
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో తరవాణి చాలా పాపులర్.
వేసవి కాలం లో ఎండను పడి వచ్చి న వారికి దాహం మరియు అలసట తీర్చడానికి తరవాణి చాలా ఉపయోగ పడుతుంది.
అంతే కాదు ....కొత్త ఆవకాయ తో తరవాణి రుచి....
చెప్తే తెలిసేది కాదు .....
అది రుచి చూసి తీరాల్సిందే...
అనుభవించి లోట్టలేయాల్సిందే......
మొత్తానికి కొంచెం పులుపు ....కొంచెం కమ్మదనం
దానికి తోడుగా కొంచెం ఆవకాయ కారం .....
కొసరి కొసరి వడ్డించే అమ్మ చేతి మమకారం .....
అన్ని కలగలిపితే ....తరవాణి ఒక అద్భుతం .....
అందుకే నా బ్లాగ్ కి తరవాణి అని నామకరణం చేశా.....
అంత అద్భుతం గా కాక పోయిన వీలైనంత లో ...
నా బ్లాగ్ ని దిద్దుదామని అనుకుంటున్నా ......
మీ సహాయ సహకారాలు అందించి ఈ బ్లాగ్ ని మరింత సుందర సుమధురం గా చేస్తారని ఆశిస్తూ
మీ.....
శ్రీకాంత్ చాగంటి
1 comment:
The name itself is not known to Many People today..
Good to hear from you.
Post a Comment